హైదరాబాద్ లో మెట్రో విస్తరణ మొదటి అడుగు పడింది. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి మెట్రో ట్రైన్ మంచి మార్గం. మూడు లైన్లుగా గ్రేటర్ హైదరాబాద్ లో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 69కి. మీటర్ల పొడవు ఉన్న లైన్ మార్గాన్ని మొదటి దశ విస్తరణలో భాగంగా 74 కి. మీటర్లుకు పెంచుతున్నారు. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో పాత బస్తీ ప్రాంతంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే హైద్రాబద్ మెట్రో రైల్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో పాతబస్తీకి మెట్రో మోక్షం కలగనుంది.
జేబీఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్ నుమా వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు మార్చి 8న ఓల్డ్ సిటీలో 5 కి.మీ మెట్రో లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు భూమి పూజ ( ఫౌండేషన్ స్టోన్ ) చేయనున్నట్లు హైద్రాబద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. ఇది పూర్తి అయితే ఓల్డ్ సిటీ, ఫలక్ నుమా వైపు వెళ్లే ప్యాసింజర్స్ కు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.