మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ వస్తువులు వెంట తీసుకెళ్తే నో జర్నీ

మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ వస్తువులు వెంట తీసుకెళ్తే నో జర్నీ

హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో కీలక సూచనలు చేసింది. జర్నీ సమయంలో ప్రయాణికులు వెంట తీసుకురాకూడని నిషేదిత వస్తువుల జాబితాను విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత, ఇతర కారణాల దృష్ట్యా ట్రైన్లో కొన్ని వస్తువులపై నిషేధం విధించినట్లు తెలిపింది. పదునైన వస్తులు అంటే.. కత్తులు, కత్తెర్లు, చాకులు, గొడ్డలి, గడ్డపార వంటి వస్తువులు మెట్రోలో అనుమతించమని స్పష్టం చేసింది. అలాగే.. గన్స్, లైటర్, స్టన్ గన్స్ వంటి పేలుడు స్వభావం ఉన్న వస్తువులపైన బ్యాన్ విధించినట్లు తెలిపింది.

వీటితో పాటు మద్యంపైన మెట్రో ఆంక్షలు విధించింది. సీల్‌ వేసి ఉన్న రెండు సీసాలను మాత్రమే అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే.. మెట్రోలో ప్రయాణించే సమయంలో కొందరు ప్రయాణికులు తమ వెంట నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో  మెట్రో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. 

Also Read :- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ స్కాం

దీంతో మెట్రో సిబ్బందికి ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. నిషేధిత వస్తువు అని మాకు ఎలా తెలుస్తుంది అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెట్రో చర్యలు తీసుకుంది. ఈ మేరకు మెట్రోలో నిషేధిత వస్తువుల జాబితాను ప్రతి స్టేషన్లోని ఎంట్రన్స్‎ల వద్ద రాసి పెట్టింది. లిస్ట్‎లో ఉన్న వస్తువులు ఉంటే మెట్రోలో అనుమతించమని  స్పష్టంగా తెలిపింది.

నిషేధిత వస్తువుల జాబితా:

తుపాకులు, పదునైన పరికరాలు,పెంపుడు జంతువులు, మద్యం, మాంసం, మానవుల లేదా జంతువుల రక్తం, కుళ్లిన మాంసం, జంతువుల మృతదేహాలు, ఎముకలు, ఎరువులు, పాడైన కూరగాయల పదార్థాలు, సీల్‌ వేయని మొక్కలు, ప్యాక్‌ చేయని చేపలు, మాంసం,  రంపం, కత్తి, చాకు, బ్లేడ్, తుపాకీ పొడి, డైనమైట్, బాణసంచా, హ్యాండ్‌ గ్రనేడ్, పేలుడు పదార్థాలు,  స్పోర్ట్స్, ఎయిర్‌ రైఫిల్, గన్‌ లైటర్, స్టన్‌గన్, పెంపుడు పక్షులు, యాసిడ్స్ మెట్రో నిషేధం విధించిన జాబితాలో ఉన్నాయి.