
హైదరాబాద్ సిటీ, వెలుగు: అవయవాల తరలింపులో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తున్నది. వరుసగా రెండో రోజూ గ్రీన్చానెల్ ద్వారా మరో వ్యక్తి ప్రాణాలను కాపాడింది. శుక్రవారం కామినేని హాస్పిటల్ నుంచి రసూల్ పురాలోని కిమ్స్ హాస్పిటల్ కు గుండెను తరలించగా, శనివారం మరోసారి ఇదే కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కు గుండెను తరలించింది.
శనివారం రాత్రి 8.12 నుంచి 8.35 గంటల సమయంలో ప్రత్యేక రైల్లో డాక్టర్ల పర్యవేక్షణలో 22 కి.మీ దూరం, 18 మెట్రో స్టేషన్లు దాటి విజయవంతంగా గుండెను చేర్చింది. నాగోల్ స్టేషన్నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు స్టేషన్ కు మెట్రోలో తరలించగా, హాస్పిటల్ కు అంబులెన్స్ ద్వారా తరలించారు. జీవన్ దాన్ ద్వారా సేకరించిన ఈ గుండెను ఓ వ్యక్తికి అమర్చారు