హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యలపై ఎండీ రియాక్షన్ ఇదే..

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యలపై ఎండీ రియాక్షన్ ఇదే..

హైదరాబాద్ లో సోమవారం ( నవంబర్ 4, 2024 ) మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఎక్కడిక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో అటు స్టేషన్లో ప్రయాణికులు, ఇటు రైళ్లలో ఉండిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

 సుమారు గంట పాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడటంతో మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉండగా.. మెట్రో రైళ్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో రైళ్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు వస్తుంటాయని అన్నారు.

Also Read :- నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్ మున్షీ.. బీజేపీ నేత ప్రభాకర్

మీడియా ఇలాంటివాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తోందని అన్నారు. ప్రపంచంలో సక్సెస్ అయిన మెట్రోలలో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచిందని అన్నారు. 2010లో బిడ్ ప్రాసెస్ కి వెళ్తే.. ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఆన్లైన్ పేమెంట్స్ లో భారత్ ప్రపంచంలోకెల్లా ముందుందని అన్నారు ఎన్వీఎస్ రెడ్డి.