సీఎం ఆదేశాలు.. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు స్పీడప్

సీఎం ఆదేశాలు.. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు స్పీడప్

ఓల్డ్ సిటీలో మెట్రో రైలు విస్తరణ కోసం భూసేకరణ పనులు స్పీడప్ అయ్యాయి. త్వరగా మెట్రో రైల్ ను పట్టాలు ఎక్కించేందుకు అధికారులు స్థల సేకరణ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల MGBS నుంచి చంద్రాయణ గుట్ట మార్గంలో భూసేకరణ పనులు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే గుర్తించిన 1 వెయ్యి 100 ప్రభావిత ఆస్తుల సేకరణ కొనసాగుతోంది. 

ఈ ప్రభావిత ఆస్తుల్లో ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ని జిల్లా కలెక్టర్ కి సమర్పించామన్నారు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ MD NVS రెడ్డి. 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను దఫదఫాలుగా కలెక్టర్ జారీ చేసారన్నారు. నోటిఫై చేసిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ను కలెక్టర్ జారీ చేశారన్నారు NVS రెడ్డి. 200 ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించడం పూర్తవుతుందన్నారు. తర్వాత వెంటనే వాటికి పరిహారం చెల్లించి, వాటిని కూల్చే పనులు ప్రారంభం అవుతాయన్నారు NVS రెడ్డి. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానులంగా చర్చిస్తున్నామన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం స్థలం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు NVS రెడ్డి.

రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలన్నిటినీ తప్పించి వాటిని ఇంజినీరింగ్ సొల్యూషన్ల తో పరిరక్షిస్తున్నామన్నారు NVS రెడ్డి. మెట్రో రైల్ రాకతో పాత నగరం ఎంతో ఆకర్షణీయ ప్రాంతంగా రూపుదాల్చనుందన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు కావడమే కాకుండా, కాలుష్య రహితంగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి సాధించనుందన్నారు NVS రెడ్డి. భూసేకరణ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తూ..పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ కు వివరిస్తున్నామన్నారు NVS రెడ్డి.