బుధవారం(జూన్ 05) సాయంత్రం నగరంలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతోనే నిలిపివేసినట్టు లోకో పైలట్లు తెలిపారు.
తిరిగి 10 నిమిషాల అనంతరం మెట్రో రైలు సర్వీసులు పునఃప్రారంభం కాగా.. గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. స్టేషన్లలో ఎక్కువ సేపు ఉండి కాలక్షేపం చేశారని జరిమానా విధించారు. ఒక్కొక్కరి నుంచి బలవంతంగా రూ.15 చొప్పున వసూలు చేశారు. ఒక ప్రయాణికుడు తాను చెల్లించిన జరిమానా రసీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సాంకేతిక లోపంతో రైలు ఆగిపోతే, జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రయాణికుడు తన పోస్టులో ప్రశ్నించాడు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెట్రో రైల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. "ఓవర్‌స్టేనింగ్"పై ప్రయాణికులకు విధించిన ఛార్జీలను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మంది ప్రయాణికులపై ఛార్జీ విధించారు..? ఎంతమందికి తిరిగి చెల్లించారు అనే వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
Charging extra amount because of 'overstaying in the system'.
— shiva charan (@ShivaCharan94) June 5, 2024
Overstayed because of the delays/technical issues in Ameerpet/Irrum Manzil metro stations.
Why should we pay for that?@ltmhyd @HiHyderabad @swachhhyd #Hyderabad #Metro #Delay pic.twitter.com/hNdHdU2QrK
🚇 Service Update: Brief disruption resolved swiftly! Despite a TRANSCO feeder trip at MGBS, our team connected to an alternative feeder at Miyapur in just 7 minutes, ensuring minimal inconvenience. Your journey with us remains our top priority!#hyderabadmetro #hydeabadrains pic.twitter.com/Czdf4UQDmK
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) June 5, 2024