మెట్రో రైల్ కు రెండు అవార్డులు

హైదరాబాద్ సిటీ , వెలుగు : పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ గ్లోబల్ కమ్యూనికేషన్స్ పోటీల్లో ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్, ఉత్తమ సోషల్ మీడియా క్యాంపెయిన్ విభాగంలో హైదరాబాద్​మెట్రో రైల్​సంస్థకు రెండు అవార్డులు లభించాయి. తమ చిత్తశుద్ధికి ఈ అవార్డులు నిదర్శనమని మెట్రో రైల్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ మురళివరదరాజన్ అన్నారు.