ఏడాదిలో హైదరాబాద్ మెట్రోకు రూ.625కోట్ల నష్టం

ఏడాదిలో హైదరాబాద్ మెట్రోకు రూ.625కోట్ల నష్టం

హైదరాబాద్ మెట్రో రైల్ నష్టాల్లో నడుస్తోంది.ఎల్అండ్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రజారవాణాలో మంచి గుర్తింపు పొందింది. అయినప్పటికీ ప్రారంభం నుంచి ఈ సంస్థ నష్టాలతోనే సాగుతోంది. 

రిపోర్టుల ప్రకారం.. 2024-25  మధ్యకాలంలో రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసినట్టు హైదరాబాద్ మెట్రో రైల్(HMRL) వెల్లడించింది. 2025 మొదటి క్వార్టర్ లో కూడా5.55కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.2017లో ప్రారంభమైన మెట్రో అప్పటినుంచి ఇప్పటివరకు రూ.6598.21కోట్లు నష్టపోయింది. సర్వీస్ విషయంలో హైదరాబాద్ ప్రజల ఆదరణ పొందిన మెట్రో కోవిడ్ సమయంలో ఒక సంవత్సరం పాటు ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మరింత కుదేలయ్యింది.

అదేసమయంలో వివిధ ప్రాజెక్టులకు లోన్లు కట్టాల్సి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య సాధారణ స్థాయి వచ్చేందుకు రెండేళ్లు పట్టింది. దీంతో హైదరాబాద్ మెట్రో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. ఇవన్నీ కలిపి రూ. 4828.55 కోట్ల నష్టం వాటిల్లింది. గతేడాది మెట్రో ఆస్తుల తాకట్టు కొంత నష్టాలను తగ్గించింది.టికెట్ల అమ్మకం, అడ్వర్టైజ్మెంట్ల  ద్వారా మెట్రో రూ.1400కోట్ల ఆదాయం పొందినప్పటికీ అధిక వడ్డీలు మెట్రోను భారీ నష్టాల్లోకి నెట్టింది.