
బెట్టింగ్ యప్డ్ యాడ్స్ విషయంలో హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ యాడ్స్ పై హైకోర్టు నోటీసులు ఇచ్చిన క్రమంలో బెట్టింగ్ యాప్ యాడ్స్ ను తొలగించింది హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ మేరకు హైకోర్టుకు సమాచారం అందించింది మెట్రో రైల్ కార్పొరేషన్. అన్ని మెట్రో స్టేషన్లలో ఉన్న బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాడ్స్ తొలగించినట్లు తెలిపింది కార్పొరేషన్.
1xBET, ఫెయిర్ ప్లే, మై జాక్ పాట్ 777, వంటి ఇల్లీగల్ ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు బెట్టింగ్ యాప్ యాడ్స్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నోటీసుల ప్రకారం అన్ని మెట్రో స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ కి సంబందించిన యాడ్స్ తొలగించమని స్పష్టం చేశారు అడ్వాకెట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.
HMRL, L&T మధ్య ఒప్పందంలోని క్లాజ్ 17.5 ప్రకారం, యాడ్స్ పై హక్కులు L&Tకే ఉన్నాయని తెలిపారు సుదర్శన్ రెడ్డి. మెట్రో స్టేషన్ల ఆవరణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి జీహెచ్ఎంసీ నుంచి సమాచారం అందిన తర్వాత వెంటనే వాటిని తొలగించాలని HRML L&Tని ఆదేశించిందని తెలిపారు.