హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపాలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ మెట్రోలో  సాంకేతిక లోపాలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం ( జనవరి 29, 2025 ) ఉదయం సాంకేతికలోపం తలెత్తడంతో సుమారు రెండు గంటలకు పైగా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అమీర్పేట్ టు హైటెక్ సిటీ నాగోల్ నుంచి సికింద్రాబాద్ మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్ల రాకపోకలకు స్పిడప్ చేయదానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిగ్నలింగ్ లో లోపం వల్ల రైళ్లు స్లోగా నడుస్తున్నాయి.

ఈ క్రమంలో నాగోల్ రాయదుర్గం రూట్ బ్లూ లైన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నలింగ్ లో లోపం వల్లే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఎల్ అండ్ టీ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ALSO READ | చకచకా సన్నాల మిల్లింగ్..ఉగాది నుంచి రేషన్​ కార్డులపై సన్నబియ్యం!

సిగ్నలింగ్ సిస్టంలో సమస్యను గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ బ్లూ లైన్ రూట్ లో రైళ్లు స్లోగా నడుస్తున్నాయి.  మరికాసేపట్లో సిగ్నలింగ్ సమస్య ను పరిష్కారం అవుతుందని తెలిపారు మెట్రో అధికారులు..ఉదయాన్నే ఆఫీస్ వేళలు కావడంతో తీవ్ర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. 

హైదరాబాద్ మెట్రోలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కొన్నిసార్లు మెట్రో రైళ్లు పట్టాలపైనే ఆగిపోయాయి. ఆ మధ్య ఓ స్టేషన్​లో మెట్రో డోర్లు తెరచుకోక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ( జనవరి 29 ) కూడా మెట్రోలో  సిగ్నల్ సిస్టంలో లోపం వల్ల రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.