హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు బడ్జెట్ జీవో రిలీజ్

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు బడ్జెట్ జీవో రిలీజ్

హైదరాబాద్‌లో మెట్రో లైన్ విస్తరణకు కాంగ్రెస్ సర్కార్ నడుం బిగించింది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ బడ్జెట్ అండ్ లైన్ పొడవు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ నిర్మాణం కానుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్లు మెట్రో నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు నవంబర్ 2న జీవో విడుదల చేసింది ప్రభుత్వం.

ఐదు కారిడార్లు

  • నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్  : 36.8 కిలో మీటర్లు
  • రాయ్ దుర్గం నుంచి కోకాపేట్ : 11.6 km
  • MGBS నుంచి ఓల్డ్ సిటీ : 7.5km
  • మియా పూర్ నుంచి పటాన్ చెర్వు ; 13.4km
  • ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ : 7.1 km

పార్ట్ B 

  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు : 40km

ఐదు రూట్లు, పార్ట్ B కలిపి మొత్తం 116.4 km కొత్తగా హైదరాబాద్ మెట్రో విస్తరించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు.