గణేష్ నిమజ్జనం రోజు మెట్రో సర్వీస్ టైం పొడిగింపు

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు, ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17)న అర్ధరాత్రి తర్వాత కూడా మెట్రో సర్వీసులు నడపనుంది. అన్ని మెట్రో లైన్లలో సెప్టెంబర్ 17న రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుపాటులో ఉంటాయి. అన్ని లైన్లలో చివరి మెట్రో ట్రైన్ సెప్టెంబర్ 18న 1AM కు ఉంటుందని HMRL MD NVS రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణీలు వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, భద్రత ఉండనుంది. అయితే ఖైరతాబాద్ కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని కోరారు.

గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు రద్దీ సమయాల్లో నడపనున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు HMRL MD NVS రెడ్డి మరియు L&TMRHL MD శ్రీ KVB రెడ్డి తెలిపారు.

గత రెండు వారాలుగా హైదరాబాద్ మెట్రో రైళ్లు స్టేషన్లలో భారీ రద్దీ పెరిగింది. ప్రయాణీకుల సంఖ్య ప్రతిరోజూ 5 లక్షల మార్కును దాటుతోంది. ఖైరతాబాద్ గణేష్ సందర్శకులు మెట్రో ప్రయాణీకుల రద్దీని మరింత పెంచారు. శనివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను సుమారు 94వేల మంది ప్రయాణికులు ఉపయోగించారు. 39,000 ఎంట్రీలు మరియు 55,000 ఎక్సైట్ నమోదయ్యాయి.