New Year 2025 : అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో.. సేఫ్ జర్నీకి గుడ్ న్యూస్

New Year 2025 : అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో.. సేఫ్ జర్నీకి గుడ్ న్యూస్

కొత్త ఏడాది 2025కి స్వాగతం చెబుతూ.. హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. అర్థరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. 2024 డిసెంబర్ సాయంత్రం నుంచి మొదలయ్యే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను దృష్టి పెట్టుకుని.. ప్రయాణికుల భద్రత, పార్టీ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు హైదరాబాద్ మెట్రో.. తన సర్వీసుల టైం పొడిగించింది. 

2025, జవవరి ఒకటో తేదీ అర్థరాత్రి 12  గంటలకు న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పిన తర్వాత.. పార్టీల నుంచి ఇళ్లకు సేఫ్ గా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ.. అర్థరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు సర్వీసులు నడపనుంది. లాస్ట్ సర్వీస్ 12 గంటల 30 నిమిషాలకు టెర్మినల్ నుంచి బయలుదేరి ఒంటి గంట 15 నిమిషాలకు లాస్ట్ స్టాప్ ఉంటుందని.. ప్రయాణికులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది హైదరాబాద్ మెట్రో.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ సహజంగానే ఎక్కువగా ఉండనుంది.. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసులు పొడిగించినట్లు వెల్లడించింది. పార్టీలకు వెళ్లే వారు.. పార్టీల నుంచి ఇంటికి చేరుకునే వారు.. మెట్రోలో జర్నీ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది హైదరాబాద్ మెట్రో..