హైదరాబాద్ మెట్రో సర్వీసుల్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హైదరాబాద్ సిటీలో నాగోల్ నుంచి రాయదుర్గం రూటు.. అదే విధంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక సమస్యతో సర్వీసులు ఆగినట్లు మెట్రో అథారిటీ వెల్లడించింది.
లాంగ్ వీకెండ్ తర్వాత.. సోమవారం ఉదయం సహజంగానే మెట్రో రైళ్లు కిటకిటలాడతాయి. ఎక్కటానికి ప్లేస్ కూడా ఉండదు.. అలాంటి సమయంలో.. 2024, నవంబర్ 4వ తేదీ సోమవారం ఉదయం రైలు సర్వీసులు బ్రేక్ డౌన్ కావటంతో.. మెట్రో స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అన్ని స్టేషన్లలోనే వేలాది మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. కనీసం కాలు పెట్టటానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆగిపోయిన సర్వీసులు.. మెట్రో స్టేషన్లలో రద్దీ#hyderabad #hyderabadmetro #hyderabadnews pic.twitter.com/7ukQyNqyNO
— raghu addanki (@raghuaddanki1) November 4, 2024
వివిధ ప్రాంతాలకు వెళ్లటానికి ఆయా మెట్రో స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికులు.. రైళ్లల్లోనే ఉండిపోయారు. కొంత మంది ఆయా స్టేషన్లలో దిగి బస్సులు, ఆటోల్లో వెళుతున్నారు. మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్య.. ఆగిపోవటానికి కారణాలు ఏంటీ అనేది అధికారికంగా ప్రకటించలేదు మెట్రో అథారిటీ.