హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు కారిడార్ II మార్గంలో30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని L&T తెలిపింది. ఆర్టీసీక్రాస్ రోడ్స్ లో మెట్రో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది, దీని కారణంగా అరగంట ఆలస్యమవుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిపాదించిన విధంగా లార్సెన్ & టూబ్రో (L&T) సంస్థ జూబ్లీ బస్ స్టేషన్ (JBS) , మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) మధ్య కారిడార్-IIలో మెట్రో రైలు సేవలను అందిస్తుంది. అయితే ఈ రూట్లో నడిచే మెట్రో ట్రైన్ల షెడ్యూల్ లో మార్పులు చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 30 నుండి జూలై 16 వరకు అరగంగ ఆలస్యంగా నడుస్తాయని L&T ప్రతినిధులు తెలిపారు. కారిడార్-IIలో ప్రతిరోజూ ఉదయం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సవరించిన షెడ్యూల్ సుమారు రెండు వారాల పాటు అమలులో ఉంటుంది, మెట్రో కార్యకలాపాలకు ఆటంకం లేకుండా నిర్మాణ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు కల్పించారు,