![Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోకు 8 అవార్డులు..](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-metro-wins-8-awards-and-a-trophy-for-landscape-garden_Uq9zGxoIsg.jpg)
హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్ విభాగంలో 8 గోల్డ్ గార్డెన్ అవార్డులు, ఒక రోలింగ్ ట్రోఫీని అందుకుంది. తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్-2024లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ అవార్డులను అందుకుంది.
బ్లూ, రెడ్, గ్రీన్ లైన్లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్లలో అత్యుత్తమ నిర్వహణకు 8 గోల్డ్ గార్డెన్స్, రోలింగ్ ట్రోఫీ అందుకుంది. హైదరాబాద్ మెట్రో ఈ అవార్డులను అందుకోవడం వరుసగా ఇది 6వ సంవత్సరం.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు రోలింగ్ ట్రోఫీని అందించారు. ఫిబ్రవరి 4వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తరపున సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ సాయినాథ్ సుంకర చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో స్టేషన్లు, రూఫ్‌టాప్ గార్డెన్‌లలో పచ్చదనాన్ని సృష్టించినందుకుగానూ మెట్రో రైలుకు అవార్డులు లభించాయని తెలిపారు.