- గంటల వ్యవధిలో రీసాల్వ్ చేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ మెట్రో ఎక్స్(ట్విటర్) అకౌంట్ గురువారం ఉదయం హ్యాక్ అయ్యింది. గంటల వ్యవధిలోనే అకౌంట్‌ను తిరిగి పొందినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. హ్యాక్ చేసిన దుండగులు స్వయంగా ఇది హ్యాక్ చేసిన అకౌంట్ అంటూ ట్వీట్‌చేశారు. క్రిప్టో కరెన్సీ ప్రకటన చేశారు. కరెన్సీ టోకెన్కొనమని క్రిప్టో వాలెట్అడ్రస్ను కూడా షేర్ చేశారు. గుర్తించిన ఎల్అండ్ టీ వెంటనే అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
హ్యాక్‌కు గురైన తమ ఎక్స్ అకౌంట్లో ఏ లింక్ ను క్లిక్ చేయొద్దని, తమ నుంచి తదుపరి అప్డేట్వచ్చే వరకు వేచి ఉండాలని కోరింది. మధ్యాహ్నం ఒంటి గంట టైంలో మళ్లీ అకౌంట్రీసాల్వ్చేసి మధ్యాహ్నం 1.36 సమయంలో అకౌంట్లో ట్వీట్‌చేశారు. దీనిపై ఎల్అండ్ టీ అధికారులు స్పందిస్తూ.. గురువారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్స్అకౌంట్స్హ్యాక్అయ్యాయని, అందులో ఎల్అండ్ టీ మెట్రో హైదరాబాద్ అకౌంట్కూడా ఉందన్నారు.