
సహజీవనానికి అడ్డొస్తున్నారని వెంట వెంటనే తల్లీ కూతుళ్లను చంపేసిన కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, లాలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస హత్యలపై విస్తుపోయే నిజాలు వెల్లడించారు పోలీసులు. ప్రేమ వ్యవహారంపై అభ్యంతరం తెలిపారని అత్యంత కిరాతకంగా చంపిన ఈ ఘటనపై నిందితులను ఇవాళ (మార్చి 11) రిమాండ్ కు పంపారు పోలీసులు. ప్రధాన నిందితుడుగా ఉన్న అరవింద్, అతనికి సహకరించిన లక్ష్మీ లను అరెస్టు చేసి విచారించిన అనంతరం రిమాండ్ కు తరలించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. మేస్త్రిగా పనిచేస్తున్న అరవింద్ కు లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటూ వారసత్వంగా వచ్చిన తన తండ్రి ఉద్యోగాన్ని చేస్తున్న లక్ష్మికో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య సహజీవనానికి దారితీసింది. ఇద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవాలని భావించారు.
వివాహం చేసుకునే విషయమై లక్ష్మీ తన అక్క జ్ఞానేశ్వర్ కి చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాహేతర సంబంధంపై మందలించగా అక్కపై కక్ష పెంచుకున్న లక్ష్మీ.. రోకలిబండతో కొట్టి చంపేసి బట్టలో చుట్టి మృతదేహాన్ని డ్రైనేజీలో పడవేశారు.
ఆ తర్వాత తాము పెళ్లిచేసుకోవాలనుకున్న విషయాన్ని నాలుగు రోజుల తర్వాత లక్ష్మి తల్లి సుశీలకు చెప్పి తమ వివాహానికి అనుమతి కోరింది. సుశీల అడ్డు చెప్పడంతో ఆమెను అరవింద్ చంపేశాడు.
ఈనెల (మార్చి) 10వ తేదీ సాయంత్రం ప్రధాన నిందితుడు అరవింద్ ను అరెస్టు చేశారు పోలీసులు. మరుసటి రోజు11వ తేదీన లక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సహజీనం కోసం లేదా పెళ్లి కన్న తల్లిని, సొంత అక్క అని చూడకుండా క్రూరంగా హత్య చేసిన లక్ష్మీతో పాటు ఆమె ప్రియుడు అరవింద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.