రన్నింగ్​ బైక్​లో మంటలు.. దగ్ధం.. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఐటీ ఉద్యోగి

రన్నింగ్​ బైక్​లో మంటలు.. దగ్ధం..  ప్రమాదం నుంచి తప్పించుకున్న ఐటీ ఉద్యోగి

గచ్చిబౌలి, వెలుగు: రన్నింగ్​బైక్​లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కూకట్ పల్లిలో ఉండే సయీద్(24) గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఓ సంస్థలో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలప్పుడు తన పల్సర్ ఎన్ఎస్ 200 మీద గచ్చిబౌలి చౌరస్తా నుంచి ట్రిపుల్ ఐటీ చౌరస్తా వెళ్తున్నాడు. 

వినాయక్ నగర్ వద్ద బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సయీద్ వెంటనే బైక్ ఆపి, పక్కన నిలిపాడు. ఫైర్ సర్వీస్ కు ఫోన్ చేశాడు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు బైక్​పూర్తిగా కాలిపోయింది. ఎండ వేడిమి కారణంగా తెలుస్తోంది.