హైదరాబాద్ మ్యూజియంకు రాంజీ గోండు పేరు..

హైదరాబాద్ మ్యూజియంకు రాంజీ గోండు పేరు పెట్టామని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆదివాసీలను గౌరవించుకున్నామని చెప్పారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కుటుంబ పార్టీలకు నచ్చదని విమర్శించారు. అదిలాబాద్ లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి బిడ్డల కోసం రూ.24 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని చెప్పారు. 

ఆదివాసీల కోసం సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రిబ్యునల్ లైబ్రెరీని ఏర్పాటు చేశామని చెప్పారు. బీజేపీ రాకముందు ఆదివాసి మహిళా రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా అని మోదీ ప్రశ్ని్ంచారు. ఆదివాసుల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీకి నాలుగు వందల సీట్లు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.