విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం ఘటన: అశోక్ రెడ్డి మృతి

హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో గాయపడిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. గత కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థి ఫీజుకు సంబంధించిన విషయంలో చర్చించే సమయంలో విద్యార్థి నాయకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలేజీ ప్రిన్సిపల్ గదిలోని దీపంపై పెట్రోల్ పడటంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. అప్పటి నుంచి కంచన్ బాగ్ లోని DRDO హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ చనిపోయాడు.