హైదరాబాద్, వెలుగు:గోవా డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ) బ్రేక్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డీజే, ఈవెంట్స్ ఆర్గనైజర్ మోహిత్ అగర్వాల్ అలి యాస్ మైరాన్ మోహిత్(30), కేఎమ్‌సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మన్యం కృష్ణకిషోర్‌రెడ్డి(50)ని హెచ్‌న్యూ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రాంగోపాల్‌పేట్ పీఎస్‌లో నమోదైన కేసులో నిం దితులుగా చేర్చి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో గోవా డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను నవంబర్ 5న హెచ్‌న్యూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎడ్విన్ డ్రగ్స్ నెట్‌వర్క్ ఆధారంగా డీజే ఈవెంట్ మేనే జర్ మోహిత్, కృష్ణ కిషోర్‌రెడ్డిని గుర్తించారు. ఇద్దరిపై నిఘాపెట్టారు. బంజారాహిల్స్‌లోని ఎఫ్ హౌస్‌తో పాటు మరో ఆరు పబ్స్‌లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల కొకైన్, సెల్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి సోమవారం వెల్లడించారు.
డీజే ప్లేయర్ నుంచి డ్రగ్ సప్లయర్‌గా..
సైబరాబాద్ కొండాపూర్‌కు చెందిన మోహిత్ అగర్వాల్ గోవా, ముంబై పబ్స్‌లో వెయిటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే డీజే ఆపరేషన్స్ తెలుసుకున్నాడు. ముంబై, గోవాల్లో ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా ఈవెంట్స్ కండక్ట్ చేశాడు. 2014లో ది‘‘అన్‌స్క్రిప్టెడ్” టైటిల్‌తో సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రారంభించాడు. కస్టమర్లతో పరిచయాలు ఉండడంతో డ్రగ్స్ దందా ప్రారంభించాడు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌లో డీజే నిర్వహించాడు. ఇదే టైంలో ఎడ్విన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేయడం ప్రారంభించారు.
గోవా నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రగ్స్
ప్రైవేట్ ట్రావెల్స్‌లోని స్లీపర్ కోచ్‌లో గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసేవారు. మోహిత్ ముంబై, గోవా, చెన్నై బీచ్‌ల్లో నిర్వహించే డీజే ఈవెంట్స్‌లో కొకైన్,హెరాయిన్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. కస్టమర్లకు డీజే ప్లే బాయ్స్ సాయంతో డ్ర గ్స్ అందించేవాడు. 2021 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూయిజ్ డ్ర గ్స్ పార్టీ కేసులో మోహిత్ అగర్వాల్ పాత్ర ఉన్నట్లు హెచ్‌న్యూ పోలీసులు గుర్తించారు. మోహిత్ కాల్ డేటా ఆధారంగా ఈవెంట్స్ కండక్ట్ చేసినట్లు పబ్స్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. వాట్సాప్, కాల్‌డేటాలో హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపారులు,సెలబ్రిటీలు ఉన్నట్లు సమాచారం.
బిజినెస్‌మెన్ డ్రగ్స్ దందా
ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన మన్యం కృష్ణకిషోర్ రెడ్డి కి ‘కేఎమ్‌సీ’ అనే రోడ్ కాంట్రాక్ట్స్, కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది. వ్యాపారవేత్తలు, ఫ్రెండ్స్‌తో కలిసి పబ్స్, ప్రైవేట్ గెస్ట్‌హౌసెస్‌లో పార్టీలు ఇచ్చేవాడు. ఇలా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. గోవా, బెంగళూర్ నుంచి కొకైన్ కొనుగోలు చేసేవాడు. ఆ తరువాత బెంగళూర్‌లోని ఎడ్విన్ డ్రగ్ ఏజెంట్లతో కలిసి హైదరాబాద్ సప్లై చేయడం ప్రారంభించాడు. ఎడ్విన్ డ్రగ్స్ కేసులో కృష్ణ కిషోర్‌రెడ్డి కాంటాక్ట్ కూడా బయటపడడంతో పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడ కృష్ణకిషోర్‌ను సిట్ విచారించింది.