హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన..నెక్లెస్ రోడ్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. దీంతో ఇకపై నెక్లెస్ రోడ్ 'పీవీ నరసింహారావు మార్గ్'గా మారనుంది. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం నెక్లెస్ రోడ్‌లో బోర్డులను అధికారులు మార్చారు.
1998లో మే 28న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నెక్లెస్ రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్ రోడ్ పేరు మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.