
ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ లో 45 మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు NMDC స్టీల్ అధికారిక వెబ్‌సైట్ nmdcsteel.nmdc.co.in లో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7వ తేది లాస్ట్ డేట్. అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు.
మొత్తం పోస్టులు
జనరల్ మేనేజర్: 19 పోస్టులు
డి వై. జనరల్ మేనేజర్: 26 పోస్టులు
అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను చూడాలి. జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి ఫిబ్రవరి 7, 2024 నాటికి 54 ఏళ్లు దాటకూడదు. డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 51 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం, CTC, కులం, సంబంధిత సర్టిఫికెట్లు, టెస్టిమోనియల్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. వాక్-ఇన్ డ్రైవ్ రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), హైదరాబాద్ (తెలంగాణ)లో జరగాల్సి ఉంది. వాక్-ఇన్ డ్రైవ్ తేదీ, సమయం NSL వెబ్‌సైట్‌లో ఉంటాయి.