ఉజ్జయిని మహంకాళి బోనాలు ..1500 మంది పోలీసులతో బందోబస్తు

ఉజ్జయిని మహంకాళి బోనాలు ..1500 మంది  పోలీసులతో బందోబస్తు

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్.  జూలై21,22న  సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరగనున్నాయని తెలిపారు.  ఆదివారం మహంకాళి బోనాలు,ఆ తర్వాత రోజు రంగం, అంబారీ కార్యక్రమం ఉంటుందన్నారు. బోనాల జాతర సందర్భంగా ఈ సారి  నెల రోజుల నుంచి ఏర్పాట్లపై కసరత్తు చేశామని చెప్పారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  టెంపుల్ చుట్టూ పక్కల క్యూ లైన్లులో కలిపి మొత్తం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు డీసీపీ రష్మి  పెరుమాళ్.మహిళ భధ్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.

భక్తుల దర్శనానికి ఆరు  క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ  రష్మి పెరుమాళ్. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేశామని చెప్పారు.  ఇందులో రెండు ప్రత్యేక లైన్స్ బోనాలతో వచ్చే వారికి ఏర్పాటు చేశాము. మిగిలిన సామాన్య భక్తుల దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశాము. మరో రెండు లైన్లు దేవాలయం  పాసులు జారీ చేసిన వారికి ఏర్పాటు చేశాం. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు ఐదుగురికి అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్ల కూడా ఈసారి ఎక్కువ గా ఏర్పాటు చేశాము. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశాము. బోనాలకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈసారి ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు డీసీపీ.

 భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు డీసీపీ రష్మి పెరుమాళ్.10 నుంచి 15 లక్షలు మంది వస్తారని అంచనా. శివ శక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ఉదయం  వేళల్లో రద్దీ ఉంటుంది కాబట్టి. వాళ్లు దర్శనం చేసుకునేందుకు స్పెషల్ టైం 1:30నుండి 4 గంటల మధ్య వారు రావాలి. శివ శక్తులు, బోగినిలు బాటా నుంచి రావాలి.. జంక్షన్ నుంచి  నేరుగా టెంపుల్ లోకి రావొచ్చు. ఒక్కో శివ శక్తులకు బోగీనిలకుతో పాటు ఐదుగురికి అనుమతి ఉంటుంది.  వారితో గుంపులు గుంపులుగా వస్తారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈసారి స్దానికుల అభిప్రాయాన్ని పలుమార్లు తీసుకున్న తర్వాతే ఏర్పాట్లు చేశాము. రెండు రోజుల పాటు మా బందోబస్తు ఉంటుంది. ఫలహారం బండ్ల కోసం ఈసారి రిజిస్ట్రేషన్ల  ప్రక్రియ పెట్టామని చెప్పారు డీసీపీ రష్మి పెరుమాళ్.