
హైదరాబాద్ లో ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ ప్రదర్శన నాంపల్లి ఎక్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వస్తుంటారు సందర్శకులు. దేశ వ్యాప్తంగా తయారు చేసిన వివిధ వస్తువులు తక్కువ ధరకు వస్తుండటం ఇక్కడ స్పెషల్.
నుమాయిష్ షెడ్యూల్ ఫిబ్రవరి15తో ముగుస్తుంది. అయితే విజిటర్స్ కోసం మరో రెండు రోజులు అంటే ఫిబ్రవరి 17 వరకు పొడిగిస్తున్నట్లు నుమాయిష్ సెక్రెటరీ బి.సురేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 17 తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని ప్రకటించారు.
ఎక్జిబిషన్ కు ప్రతి రోజు 50 వేల సందర్శకులు వస్తున్నారు. మొత్తం 2200 స్టాల్స్ లో తమకు నచ్చిన వస్తువులు కొంటున్నారని సెక్రెటరీ తెలిపారు.
ఈ నుమాయిష్ లో స్టార్టప్స్ కు సపోర్ట్ చేసేందుకు ఎక్జిబిషన్ సొసైటీ, ఐటీ హబ్, స్టేట్ ఐటీ మినిస్ట్రీ సంయుక్తంగా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశారు.