![హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు మస్త్ డిమాండ్..ఫ్యూచర్లో మరింత పిరం](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-office-stock-projected-to-surpass-200-million-square-feet-by-2030_nQCTNhKuBR.jpg)
- 2030 నాటికి హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్
- 20 కోట్ల చదరపు అడుగులకు
హైదరాబాద్, వెలుగు:2030 నాటికి హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 20 కోట్ల చదరపు అడుగులు దాటనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సీబీఆర్ఈ, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)తో కలిసి రూపొందించిన 'హైసియా స్కేల్ @ హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ డెస్టినేషన్’ రిపోర్ట్ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ఈ సందర్భంగా సీబీఆర్ఈ ఇండియా సీఈఓ అన్షుమన్ మేగజైన్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఆఫీస్ స్థలంలో హైదరాబాద్ వాటా 15 శాతం కాగా, గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్థలంలో 18 శాతంగా ఉందన్నారు. గ్లోబల్ కంపెనీల డిమాండ్ పెరుగుతున్న కారణంగా 2014 తర్వాత హైదరాబాద్‌లోని ఆఫీస్ స్పేస్కు గిరాకీ మూడు రెట్లు పెరిగింది.
అది 2024 డిసెంబర్ నాటికి 137 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. 2024లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 12.3 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ప్రధానంగా ఐటీ రంగం 31 శాతం వాటాతో ఆఫీస్ లీజింగ్‌లో ముందంజలో ఉంది.
ఇటీవల వివిధ రంగాలకు చెందిన సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకోవడం ప్రారంభించాయి. 2024లో లైఫ్ సైన్సెస్ కంపెనీలు 21 శాతం ఆఫీస్‌స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల దగ్గర14 శాతం వాటా ఉంది.