మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లారెడ్డి వేసిన.. రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో పది గంటల స్థలం సుమారు 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి.. రోడ్డు నిర్మాణం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
కాలేజీ కోసం మాజీ మంత్రి రోడ్డును వేశారు. అయితే ఈ వ్యహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు (2 మార్చి 2024 శనివారం) హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.