మద్యం మత్తులో కారుతో బీభత్సం.. యువకుడికి దేహశుద్ధి

హైదరాబాద్ లో  పాతబస్తీ మీర్ చౌక్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి వాహనాలను ఢీకొట్టాడు. సుమారు కిలోమీటర్ వాహనాలను కారు ఢీకొడుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కారును వెంబడించి యువకుడిని పట్టుకొని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులుగుర్తించారు.