
- స్టిక్కర్ అతికించి వెళ్లారు
హైదరాబాద్, వెలుగు: కులగణనలో వివరాలు తీసుకునేందుకు తమ ఇళ్లకు ఎవరూ రాలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు హైదరాబాద్ ఓల్డ్ సిటీ పబ్లిక్ ఫిర్యాదు చేశారు. బుధవారం బీసీ వెల్ఫేర్ అధికారులతో కలిసి పాతబస్తీలోని దూద్ బౌలి, ఉమ్డా బజార్, ఉస్మాన్ బాగ్‌లో చైర్మన్ పర్యటించారు. దాదాపు 200 ఇండ్లు తిరిగి కులగణన సర్వేపై ఆరా తీశారు. తమ ఇళ్లకు ఎన్యుమరేటర్లు రాలేదని, వివరాలు తీసుకోలేదని చైర్మన్ కు స్థానికులు తెలిపారు.
ఇళ్లకు వచ్చి స్టిక్కర్ అతికించి వెళ్లారని చెప్పారు. దీనిపై స్పందించిన చైర్మన్.. వారి వివరాలు నమోదు చేయాలని, ఇంటింటికి తిరగాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్ 040 -2111 1111 కు ఫోన్ చేసి వివరాలు చెప్తే ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేస్తారని పబ్లిక్ కు చైర్మన్ తెలిపారు. అలాగే, బీసీ కమిషన్ మెంబర్ బుధవారం ఎల్బీ నగర్ లో మన్సురాబాద్ డివిజన్‌లోని కాలనీల్లో పర్యటించి కులగణన రీసర్వేపై అవగాహన కల్పించారు.