
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ తదితర ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించి.. చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన లాంజ్విటీ లాంజ్‌ను బుధవారం గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్లో ప్రారంభించారు. ఒమేగా హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ మోహన వంశీ మాట్లాడారు. ఒమేగా హాస్పిటల్స్ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు.
లాంజ్విటీ లాంజ్ టెక్నాలజీతో కేవలం మనిషి ఉమ్మి ద్వారా జన్యుపరమైన పరీక్షల నిర్వహించి.. భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని చెప్పారు. కొన్ని నెలల ముందుగానే రాబోయే వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన చికిత్సను అందిస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశంలో తొలిసారి ఒమేగాలో లాంజ్విటీ లాంజ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.