హైదరాబాద్‌‌ ఓపెన్ టెన్నిస్ విన్నర్స్‌‌గా శ్రీధర్‌‌‌‌, సాంబశివారెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌‌ 17వ ఎడిషన్‌‌లో ఎల్‌‌. శ్రీధర్‌‌‌‌, సాంబశివా రెడ్డి  50 ప్లస్ సింగిల్స్‌‌, డబుల్స్‌‌లో విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోటా) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌‌ ఇంటర్నేషనల్ సెంటర్‌‌‌‌లో  జరిగిన 50 ప్లస్ సింగిల్స్ ఫైనల్లో శ్రీధర్‌‌‌‌ 10–7తో సాంబశివా రెడ్డిపై విజయం సాధించాడు. డబుల్స్‌‌లో శ్రీధర్‌‌‌‌–సాంబశివా రెడ్డి 10–6తో నర్సింహా రెడ్డి–నీలకాంత్‌‌ను ఓడించారు.

 30 ప్లస్ సింగిల్స్‌‌లో విశాల్‌‌, డబుల్స్‌‌లో విజయ్‌‌–శ్రీరామ్‌‌ ట్రోఫీ నెగ్గగా, 40 ప్లస్‌‌లో నరసింహులు సింగిల్స్‌‌, లగ్గాని శ్రీనివాస్‌‌–రాజా డబుల్స్‌‌లో  విజేతలుగా నిలిచారు. 60 ప్లస్‌‌లో ఆర్‌‌. ఎన్‌‌. ‌‌ రమేశ్‌‌, 70 ప్లస్‌‌లో గజపతి  సింగిల్స్‌‌తో పాటు డబుల్స్‌‌లో టైటిల్‌‌ నెగ్గారు.  జస్టిస్‌‌ విజయ్‌‌సేన్ రెడ్డి, హోటా ప్రెసిడెంట్‌‌ నంద్యాల నర్సింహా రెడ్డి విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.