హైదరాబాద్ ORRపై జర్నీ చేస్తుంటారా.. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఉండదేమో..!

హైదరాబాద్ ORRపై జర్నీ చేస్తుంటారా.. ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఉండదేమో..!

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ కొత్త ఎగ్జిట్ను నిర్మిస్తోంది. నానక్ రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ దగ్గర ట్రాఫిక్ జాం తలనొప్పిగా మారడంతో నార్సింగ్ టోల్ ప్లాజాకు ముందు కొత్త ఎగ్జిట్ను నిర్మిస్తున్నారు. ఈ కన్ స్ట్రక్షన్ వర్క్ 90 శాతం పూర్తయింది. మార్చిలో ఈ ఎగ్జిట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కోకాపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర కూడా కొత్తగా మరో ఇంటర్ ఛేంజ్ను కోకాపేట్ ఓఆర్ఆర్ ట్రంపెట్ పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్ పైకి వెళ్లే వెహికల్స్​పెరుగుతుండటం, ఎగ్జిట్స్ టోల్ ప్లాజాల వద్ద  రెండు  లేన్లు మాత్రమే ఉంటుండగా సమస్య పెరుగుతూ ఉంది. ఒక్కోసారి 50 నుంచి 60 వాహనాలు క్యూ కడుతున్నాయి. ఓఆర్ఆర్ పై డైలీ1.40 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 

మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్పై 22 ఇంటర్‌ చేంజ్‌ల వద్ద టోల్‌ వసూలు చేస్తున్నారు.శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల, బొంగులూర్, పెద్ద అంబర్​పేట్​, తారామతిపేట్​, ఘట్ కేసర్, కీసర, శామీర్​పేట్​, కండ్లకోయ, సారేగూడెం, సుల్తాన్ పూర్, పఠాన్​ చెరువు, ఎదుల నాగులపల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, టీఎస్​పీఏ, రాజేంద్రనగర్, నార్సింగి, కోకాపేట్, మల్లంపేట్ ఇంటర్ చేంజ్ల వద్ద టోల్ వసూల్ చేస్తున్నారు.

ALSO READ : తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, దిగేందుకు ఇరువైపులా కొన్ని చోట్ల మినహా మిగతా అంతటా టోల్​ప్లాజాలు ఉన్నాయి. ఎక్కువగా ఎగ్జిట్ల వద్దనే సమస్య కనిపిస్తుంది. పఠాన్​ చెరువు, గచ్చిబౌలి లాంటి పెద్ద టోల్​ప్లాజాల వద్ద ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ చిన్న ఎగ్జిట్లలో కూడా ఒక్కోసారి ఆలస్యమవుతుంది. టీఎస్​పీఏ వద్ద ఎగ్జిట్ టోల్ వద్ద ఏ లేన్ లో వెళ్లిన కూడా అనుమతిస్తుండటంతో చాలా ఆలస్యమవుతుంది. ఇలా తక్కువ లేన్లు ఉన్న వద్ద ఒక్కోసారి ఆలస్యమవుతుంది. ఈ కొత్త ఎగ్జిట్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య బాగా తగ్గే అవకాశం ఉంది.