
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఓఆర్‌ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి(ఏప్రిల్ 1, 2025) అమలులోకి రానున్నాయి. ఓఆర్‌ఆర్‌పై టోల్ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్‌కు కిలోమీటర్‌కు 10 పైసలు పెరిగింది. కారు, జీపు, లైట్ వెహికిల్‌కు.. కిలో మీటర్కు ఇప్పటివరకు 2 రూపాయల 34 పైసలు ఉండగా.. పెంచాక 2 రూపాయల 44 పైసలు వసూలు చేయనున్నారు. మినీ బస్, ఎల్‌సీవీ వాహనాలకు కిలోమీటర్‌కు 20 పైసలు పెంపు, బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్కు 31 పైసలు పెంపు.. భారీ వాహనాలకు కిలో మీటర్కు 70 పైసలు పెంచుతూ ఐఆర్ బీ నిర్ణయం తీసుకుంది.
ఔటర్‌రింగ్‌రోడ్ పై టోల్ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్ బి ఇన్ఫ్రా సంస్థకు టోల్ఆపరేట్ట్రాన్స్ఫర్పద్దతిలో 30 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్ పలు జాతీయ రహదారులను కలుపుతోంది. ఓఆర్ఆర్పైకి ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ఎక్స్ఛేంజ్జంక్షన్లు ఉన్నాయి. భవిష్యత్లో అభివృద్ధి అంతా ఓఆర్ఆర్ చుట్టూనే ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు ఔటర్ పై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
Also Read:-హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు
ప్రస్తుతానికి నెలకు రూ. 60 కోట్లకు పైగానే ఆదాయాన్ని పొందుతున్న సదరు సంస్థ టోల్గేట్ఛార్జీలను తాజాగా పెంచింది. దీంతో ఇంకా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం వుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఓఆర్ఆర్ను ప్రైవేట్కు అప్పగించాలని ఏకంగా 30 సంవత్సరాల లీజు కోసం రూ.7,380 కోట్లకు వారికి కట్టబెట్టారు. కానీ ఓఆర్ఆర్ నిర్వహణ భారాన్ని సదరు కంపెనీకే అప్పగించకుండా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు.