హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ మైరా జైన్ మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. హైదర్‌గూడ సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన అండర్–11 గర్ల్స్ ఫైనల్లో వైట్ టైగర్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన 3–2తో అవియాను ఓడించింది.
అండర్–15 ఫైనల్లో అనియా ఆనంద్ 3–2తో శ్రీ శాన్విని ఓడించి టైటిల్ అందుకుంది. అండర్15 బాయ్స్‌లో శ్రీ అనీశ్ విజేతగా నిలవగా, అండర్17, 19 విభాగాల్లో ఆరుశ్ రెడ్డి టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. విజేతలకు తెలంగాణ టీటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి ట్రోఫీలు అందజేశారు.