
- 9 తులాల గోల్డ్.. రూ.లక్ష క్యాష్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: దృష్టి మరిల్చి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల గ్యాంగ్‌ను మాదన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 తులాల బంగారు ఆభరణాలు, లక్ష క్యాష్స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్బి.శ్రీనివాస్తెలిపారు. తమిళనాడుకు చెందిన రమ్య(27), మీనా(30), ముట్టి మారి(30), అంజలి, పార్వతి ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని చోరీలకు పాల్పడుతున్నారు.
గత నెల 25న సుబ్బలక్ష్మమ్మ అనే వృద్ధురాలు బ్యాంకులో 10వేలు డ్రా చేసి పిసల్‌బండ బస్ స్టాప్ కు చేరుకుంది. ఆమెను మాటల్లో పెట్టి మెడలో నుంచి బంగారు హారం ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీల పరిశీలనలో తమిళనాడు గ్యాంగ్అని తేలింది. రమ్య, మీనా, ముట్టి మారిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అంజలి, పార్వతి పరారీలో ఉన్నారు.