
- ముగ్గురు అరెస్ట్.. రూ.1.80 లక్షల స్టెరాయిడ్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ/ మెహిదీపట్నం, వెలుగు: స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్టు చేశారని అడిషనల్డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. వీరి నుంచి రూ.1,80,000 విలువైన స్టెరాయిడ్స్ స్వాధీ నం చేసుకున్నారు. యాకుత్‌పురాకు చెందిన నజీర్, గౌలిపురాకు చెందిన ఆర్.సంజీవ్ సప్లిమెంట్స్ స్టోర్నడుపుతూ హకీంపేటకు చెందిన జిమ్ట్రైనర్ఇమ్రాన్ ఖాన్ తో కలిసి స్టెరాయిడ్స్సరఫరా చేస్తున్నారు. ఇమ్రాన్ఖాన్ఈజీ మనీ కోసం స్టెరాయిడ్స్ అమ్మాలని ప్లాన్వేశాడు. బాడీ బిల్డింగ్కోసం యువతను లక్ష్యంగా చేసుకొని స్టెరాయిడ్స్ఇస్తున్నాడు.
ఆర్6 ప్యూర్ గ్రోత్ హార్మోన్, ఐగ్రో, సోమా, ట్రోపిన్, థైగర్ వంటి స్టెరాయిడ్ వయల్స్, టెస్టోబోలిన్, మయోడ్రోల్, న్యూట్రోక్యూబాలిస్ వంటి క్యాప్సూల్స్, డెబోలన్ టాబ్లెట్లను సరఫరా చేస్తున్నాడు. దందాలో భాగంగా ఇమ్రాన్కొన్ని స్టెరాయిడ్స్‌ను తీసుకొని వెళ్తుండగా.. పోలీసులు మెహిదీపట్నంలో పట్టుకున్నారు. అతని సమాచారంతో సంజీవ్ స్టోర్‌లో 23 రకాల స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. నజీర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామి, ఎస్ఐ ఆర్.శరత్ చంద్ర పాల్గొన్నారు.