మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల విక్రేతలు అరెస్ట్​

మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల విక్రేతలు అరెస్ట్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు అమ్ముతున్న  ఇద్దరిని టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.  మొత్తం110 వయల్స్ ను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.1.32 లక్షలు ఉంటుందని టాస్క్​ఫోర్స్​ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.  నిందితుడు  మహమ్మద్ జిబ్రాన్ అహ్మద్ కు  జిమ్‌కు వెళ్లే అలవాటు ఉందని, తొందరగా బాడీ బిల్డింగ్ ​కోసం ఈ ఇంజెక్షన్లు వాడుతున్నాడని చెప్పారు.

ఒక్కొక్కటి రూ.324కు కొనుగోలు చేసి, గౌలిపురా మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్మాడన్నారు. మరో నిందితుడు అహ్మద్ ఖురేషి కూడా ఇదే విధంగా బాడీ బిల్డింగ్​ కోసం  ఇంజెక్షన్లు వాడి, చంద్రాయణగుట్టలో అధిక ధరకు విక్రయించాడని పేర్కొన్నారు. పోలీసులు పక్కా సమాచారంతో వారిని అరెస్ట్​ చేసి, మొగల్‌పురా, చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారని తెలిపారు.