హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు పోలీసులు.. నిందితుల నుండి 1300 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు పోలీసులు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ. కోటి 50 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు.గోవా, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. విదేశీ డ్రగ్ పెడ్లర్లు హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినట్లు సమాచారం వచ్చిందని.. లంగర్ హౌస్ పోలీస్, నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశామని తెలిపారు పోలీసులు.
ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఒలివర్ అలియాస్ జాన్సన్ సహా ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశామని.. నిందితుల్లో ఒకడైన జాన్సన్ అలియాస్ జాన్ 2009 లో బిజినెస్ వీసాపై ఇండియా కి వచ్చాడని.. 2013 లోనే నిందితుడికి వీసా గడువు ముగిసిందని తెలిపారు పోలీసులు.నైజేరియన్స్ తో పరిచయం చేసుకొని హైదరాబాద్ , బెంగళూరుకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
అంతే కాకుండా రోమియో అనే పాత నెరస్తుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు, వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లో ఉంటున్న సెల్ వేస్టార్ ను వారి దేశానికి డిపోర్టు చేస్తామని అన్నారు.