ఆన్ లైన్ మోసాలు.. బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మంది అరెస్ట్

ఆన్ లైన్ మోసాలు.. బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మంది అరెస్ట్

హైదరాబాద్ లో  అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుట్ట రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.   కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మందిని అరెస్ట్ చేశారు.   నిందితుల నుంచి భారీగా  చెక్ బుక్స్,సెల్ పోన్స్, రబ్బర్ స్టాంప్స్,డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్స్డ్ ను స్వాధీనం చేసుకున్నారు  సైబర్ క్రైం పోలీసులు.

నిందితులు మూడు రకాల సైబర్ క్రైంలకు  పాల్పడుతున్నట్లు  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు తెలిపారు. ట్రేడింగ్..డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్  వంటి మోసాలకు పాల్పడుతున్న   మొత్తం 52మంది  ముఠాను  అరెస్ట్ చేశారు. వీరిలో   ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు.  ఫెస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వార  నిందితులను ఆకర్షిస్తున్నారు.  ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 93లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు. ఓ బాధితుడు 2.06  లక్షలను విడతల వారీగా  అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.  మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారని సీవీ ఆనంద్ చెప్పారు.

ALSO READ | కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ 

పెరుగుతున్న సైబర్ క్రైమ్స్  తో జాగ్రత్తగా ఉండాలని సీపీ హెచ్చరించారు.  గుర్తుతెలియని యాప్స్, గ్రూప్స్ లో జాయిన్ కావొద్దని సూచించారు. ఆన్ ల్లైన్ ఇన్వెస్ట్ మెంట్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  సైబర్ క్రైం విషయంలో 2025లో అవగాన చాలా ముఖ్యమని చెప్పారు. 

సైబర్ క్రైం విషయంలో 2025లో అవగాన చాలా ముఖ్యం. ఎడ్యుకేటెడ్ వ్యక్తులు సైతం మోసపోతున్నారు. 3వేల 500కోట్లు గత ఏడాది సైబర్ క్రైం ద్వార మోసం జరిగింది. 13శాతం వరకే రికవరీ అయ్యింది. సైబర్ క్రైంలో రికవరీ చాలకష్టం, అవగాహన చాలా ముఖ్యం. నిందితులు ఇతర రాష్ట్రాలకు ,దేశాలకు చెందిన వ్యక్తులు కావటంతో దర్యాప్తు కష్టతరం అవుతుంతోందని సీపీ తెలిపారు.