
పహాల్గమ్ ఉగ్రదాడి ఘటనతో దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల ఏరివేతకు సిద్ధమైంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల ఏరివేత ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే 200 మందికి పైగా అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించిన పోలీసులు.. తాజాగా మరో బంగ్లాదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ( ఏప్రిల్ 28, 2025 ) పోచారంలో నకిలీ పాత్రలతో నివాసం ఉంటున్న బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఘట్కే సర్ మండలం చౌదరిగూడలోని వెంకటసాయి ప్రేమ నగర్ (మక్త)లోని ప్లాట్ నంబరు-36లో బంగ్లాదేశ్ కు చెందిన రషెల్ షేక్ అలియాస్ ఎండీ రషెల్(31) నివాసం ఉంటున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, భారతీయ ఆధార్, ఓటర్, పాన్ కార్డులు, కొవిడ్-19 టీకా వేసుకున్న ధ్రువపత్రం, బంగ్లాదేశ్ కు చెందిన ఓటర్ కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు స్థానికంగా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తు న్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.