
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఖైరతాబాద్ లో హాస్టల్స్, రూంలలో ఉంటూ గంజాయి అమ్ముతున్న ముఠాను సోమవారం ( మార్చి 17 ) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఠా సభ్యులంతా 30ఏళ్ళ లోపు యువకులే కావడం గమనార్హం. గంజాయి ముఠా కార్యకలాపాలపై పక్కా సమాచారంతో అందటంతో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు పోలీసులు.
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు ముఠాలోని యువకులు. ఇది గమనించిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి 1182 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. చిక్కడపల్లిలో గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. ఈజీ మనీ కోసం ఆశపడి ఇలా అడ్డదారులు తొక్కొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. యుక్త వయసులో కస్టపడి పని చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచి.. మంచి భవిష్యత్తు దిశగా సాగాలని సూచించారు పోలీసులు.