
హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. జాయింట్ ఆపరేషన్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను అమ్మినోళ్లతో పారు కొనుగోలు చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నలుగురు సభ్యులు ఉన్న ముఠా అప్పుడే పుట్టిన పిల్లలను గుజరాత్ నుండి తీసుకొచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు.
ఈ ముఠా ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ.4.5 లక్షలకు విక్రయిస్తున్నారని.. పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు వందనతో కృష్ణవేణికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యిందని.. గుజరాత్ నుండి పిల్లలను సప్లై చేసేందుకు వందనతో కృష్ణవేణి ఒప్పందం చేసుకుందని తెలిపారు పోలీసులు. గుజరాత్ నుండి తీసుకొచ్చిన పిల్లలను హైదరాబాద్, ఏపీలో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. గుజరాత్ కి చెందిన వందన కృష్ణవేణి, దీప్తిలతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
అప్పుడే పుట్టిన పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నట్లు అనుమాణిస్తున్నామని.. మూడు, నాలుగు రోజుల పిల్లల్ని వీళ్ళు టార్గెట్ గా చేసుకుంటున్నట్లు గుర్తించామని అన్నారు. గుజరాత్ నుండి పలువురు ఏజెంట్ల ద్వారా పిల్లలను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఈ ముఠా నుండి పిల్లలను ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్ పవన్, భార్య రమ శ్రావణి కొనుగోలు చేశారని అన్నారు పోలీసులు.
ఇద్దరు దంపతులు అరెస్ట్:
ఈ ముఠా నుండి శిశువును కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. మూడు నాలుగు రోజుల వయసున్న పిల్లలను గుజరాత్ నుండి హైదరాబాదుకి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారని.. ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఆధార్ కార్డులు ,ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు పోలీసులు.
ALSO READ : 1984 సిక్కు అల్లర్ల కేసులో : కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు
ఇందులో కీలక నిందితురాలుగా ఉన్న కృష్ణవేణిపై గతంలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందని.. గతంలో కూడా ఇలాగే పిల్లల అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిందని అన్నారు పోలీసులు. పిల్లని అడాప్ట్ చేసుకోవాలంటే చట్ట ప్రకారమే వెళ్లాలని.. చట్టాన్ని ఉల్లంఘించి అడ్డుదారుల్లో పిల్లలను కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు పోలీసులు.