హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా రూ. 5.29 కోట్ల మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సైబర్ చీటర్స్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు.
పోలీసులు అరెస్ట్ చేసిన కేటుగాళ్లు దేశవ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నారని.. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో మోసాలకు పాల్పడ్డట్లు తెలిపారు పోలీసులు. 70 ఏళ్ళ బాధిత వృద్ధుడు మొబైల్ హ్యాక్ అయ్యి రూ1.9 కోట్లు మోసపోయాయని ఫిర్యాదు చేయగా.. ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు.
ALSO READ : మైక్రోసాఫ్ట్ షాక్ : పని చేయనోళ్ల ఉద్యోగాలు పీకేస్తున్నాం..
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ మొబైల్ కి వచ్చే మెసేజ్ లలో ఉన్న లింకులను ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దని.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని ఇవ్వొద్దని సూచించారు పోలీసులు.