కి‘లేడీ’ అరెస్టు: బస్టాండ్, రద్దీ ప్రదేశాలేలక్ష్యంగా చోరీలు

కి‘లేడీ’ అరెస్టు: బస్టాండ్, రద్దీ ప్రదేశాలేలక్ష్యంగా చోరీలు
  • 11.8 తులాల బంగారం, 80 వేల నగదు, సెల్​ఫోన్ స్వాధీనం

పరిగి, వెలుగు: రద్దీగా ఉండే బస్సులు, బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న కిలాడీ లేడీని వికారాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం  పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్  కొంతమంది వ్యక్తులతో దొంగతనాలు  చేయిస్తుంటాడు.

కాగా యాదాద్రి జిల్లా భువనగిరి సీతానగర్ కాలనీకి చెందిన పసుపులేటి అమూల్య రద్దీ ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తోంది.  పక్కా సమాచారంతో ఆమెను పరిగిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి 11.8 తులాల బంగారం, 80 వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

పసుపులేటి అమూల్య పై కేసు నమోదు చేసి రిమాండ్ చేశామని తెలిపారు. వికారాబాద్ జిల్లా సీసీఎస్  సీఐ బలవంతయ్య,  పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.