హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మి అరెస్ట్...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మి అరెస్ట్...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని మల్లంపేటలో లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం ( జనవరి 30, 2025 ) ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.పలు భూకబ్జాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయలక్ష్మి గత కొద్దిరోజులుగా పరారీలో ఉన్నారు.

గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే..అప్పటినుండి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న విజయ లక్ష్మిని ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను దుండిగల్ పోలీస్ స్టేషన్ కి తరలించామని.. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.విజయలక్ష్మి ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టినట్లు అమ్మి గుర్తించిన హైడ్రా ఇటీవలే ఆ విల్లాలను కూల్చేసింది..  కూల్చి వేసిన విల్లాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఫిర్యాదు చేశారు బాధితులు. 

గతంలో విజయలక్ష్మిపై  పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అమాయకత్వాన్ని, అత్యాశను అదునుగా తీసుకున్న రియల్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఓపెన్ ప్లాట్స్, విల్లాలు వంటివి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.