హైదరాబాద్ లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.. తెలంగాణతో పాటు అమెరికా వంటి విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలో మొత్తం 13మంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. వీరిలో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఉగ్వ ఇంకేచుకవా, చుకువు ఒగ్బన్న.. ఇద్దరితో పాటు ఫారెక్స్ ఏజెంట్ మహ్మద్ మతీన్ సిద్ధికిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ముఠా లోని ప్రధాన నిందితురాలు ఎబుక సుజీతో పాటు మరో 9 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

కొకైన్, MDMA డ్రగ్స్ కోసం విదేశాల్లో ఉన్న మాఫియా కు చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని.. రూ 12.5 లక్షలు విలువచేసే 15 గ్రాముల కోకాయిన్ , 50 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశామని తెలిపారు పోలీసులు. నిందితులు కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని.. లాటిన్ అమెరికా నుండి కోకైన్ ఇండియా కు అక్రమంగా దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. 

హైదరాబాద్, బెంగళూరు సహా అమెరికా వంటి విదేశాల్లో డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మనీ ట్రాన్స్ఫర్ రూపంలో కోట్ల రూపాయలు నైజిరియా కు తరలించారని..ఇటీవల రూ. 80 లక్షలు తరలించిన ఈ ముఠా గత మూడేళ్ళలో రూ. 5 కోట్లకు పైగా నైజీరియాకు తరలించినట్లు తెలుస్తోంది. 

మనీ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ విదేశీయులు ప్రధానంగా నైజిరియన్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో వారి వివరాలు తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలని.. లేదంటే ఈ తరహా క్రైమ్స్ లో కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.నైజీరియన్లకు ఇళ్ళు అద్దెకు ఇచ్చే సమయంలో ఫామ్ C లో వారి పూర్తి వివరాలు తీసుకోవాలని..అనుమానస్పదంగా అనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 

కాలేజీ స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్ విక్రాయిస్తున్నారని..  వారిపై నిఘా పెట్టామని అన్నారు పోలీసులు. విద్యార్థులు తమ భవిష్యత్తు ని నాశనం చేసుకోవద్దు.. డ్రగ్స్ మత్తులో చిత్తు కావొద్దని సూచిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయించిన, సేవించిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని...నూతన టెక్నాలజీ లో హైదరాబాద్ టాప్ లో ఉంది.. టెక్నాలజీ ద్వారా డ్రగ్స్ సరఫరా ను అడ్డుకట్ట వేస్తామని అన్నారు పోలీసులు