మాదాపూర్ లో గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

మాదాపూర్ లో గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితుల దగ్గర నుండి 830 గ్రాముల గంజాయి,14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఒక ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :- తిరుపతిలో ఏనుగుల బీభత్సం.. టీడీపీ నేత మృతి

గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లింగ్ ముఠా ఆగడాలు తగ్గడంలేదు. మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడితే సహించబోమని.. కఠిన చర్యలు తెప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.