
- నాలుగు పక్షి పుర్రెలు, ఎనిమిది కాళ్లు, నకిలీ పులి చర్మం, గోళ్లు కూడా..
బషీర్‌బాగ్, వెలుగు: సెకండ్‌హ్యాండ్ వస్తువులు విక్రయించే జుమ్మేరాత్‌బజార్ లో నెమలి తలతోపాటు, వణ్య ప్రాణుల అవయవాలను విక్రయించడానికి వచ్చిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మహిళలు మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన వారుగా గుర్తించారు. వారి నుంచి నెమలి తలతోపాటు బ్లాక్ ఐబీస్ అనే పక్షికి చెందిన నాలుగు పుర్రెలు, ఎనిమిది కాళ్లు, నకిలీ పులి చర్మం, గోర్లను స్వాధీనం చేసుకున్నారు.
జాల్నాకు చెందిన ముగ్గురు మహిళలు శుక్రవారం జుమ్మేరాత్‌బజార్ మార్కెట్లో వన్యప్రాణుల అవయవాలు అమ్మడానికి వచ్చారని అటవీశాఖకు చెందిన ఓ మాజీ అధికారి ఇచ్చిన సమాచారంతో షాహీనాయత్గంజ్పోలీసులు గాలించి పట్టుకున్నారు.