పేకాట ఆడుతున్న 33 మంది అరెస్ట్.. లక్షల నగదు, కార్లు సీజ్‌‌

పేకాట ఆడుతున్న 33 మంది అరెస్ట్.. లక్షల నగదు, కార్లు సీజ్‌‌

గండిపేట, వెలుగు: పేకాట ఆడుతున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు తెలిపిన ప్రకారం.. పుప్పాలగూడ కంట్రీ ఫామ్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌లోని ఓ ఫ్లాట్ల్ లో చేవెళ్లకు చెందిన 21 మంది వ్యాపారులు పేకాట ఆడుతున్నారు. ఆదివారం సమాచారం అందడంతో మాదాపూర్‌‌ ఎస్‌‌ఓటీ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1.50 లక్షల నగదు, 21 మొబైల్స్, 6 కార్లను సీజ్‌‌ చేశారు. గేమింగ్‌‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జవహర్ నగర్ లో పట్టుబడిన 12 మంది  

జవహర్ నగర్, వెలుగు: మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకున్నారు. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీ సమీపంలో రహస్యంగా  పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. చింతల శ్రీనివాసరెడ్డి, పిన్నింటి నవీన్ రెడ్డి, ముత్యాల శివకుమార్, బాబు శ్రీకాంత్, ఓకంటి శ్రీనివాసరావు, కాందారి మల్లేశ్, ఇమ్రాన్, ఎండీ ఖాసిం, పెద్దగోని రాజు, చిలుకల మణికంఠ, ఇల్లూరి వెంగళ్​రెడ్డి, వంగూరి బాలును పట్టుకున్నారు. నిందితుల వద్ద 1.90 లక్షల నగదు,  సెల్ ఫోన్లు, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. పేకాట ఆర్గనైజర్లు మల్కాజిగిరి చెందిన బాబు సింగ్, ఘట్ కేసర్ చెందిన మహేశ్, ఎల్ బీనగర్ చెందిన కిరణ్, నరేశ్​యాదవ్ పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు  జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.